Friday, August 17, 2007

Kafka Rokz !!





కాఫ్కా ద్వారా నాకు ఎదురైన అతి పెద్ద సమస్య ఆయన రచన లోని ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఇది బావుంది ...ఇది సూపరూ అని చెప్పడానికి లేదు ... బుక్కు మొత్తం సూపరే ....మొదటి సారి The Metamorphosis మొదటి లైన్ లో Gregor పురుగు లా మారి పోవడం .... వాక్యం పూర్తయ్యేలోపు Joseph అరెస్ట్ అవ్వడం చదివి .... తొక్కలోది .... ఇంకేం ట్విస్టులుంటాయిలే అనుకున్నా .... కానీ మిగతాది చదువుతే తెలిసింది Kafkaesque అంటే ఏంటో .... చదివేసింతరువాత ఒక పావు గంట కధ మొత్తం నెమరేసుకొని గాఠ్ఠి గా అరిచా కాఫ్కా రాక్స్ అని ....

కాఫ్కా రచనల్లో మన పొందే డుయల్ ఎఫెక్ట్(dual effect) అనిర్వచనీయమైనది .... ఆ వాక్యానికి తగ్గ expression వాడుతూనే ...ఎక్కడో దూరం లో జరగ బోయే చీకటి ఫేల్యూర్ ని కూడా చూపించేసి వెన్ను లో చలి మొదలు పెట్టిస్తారు ..... అదే కాఫ్కా స్పెషాలిటీ .... ఆయన రచనల్లోనీ ప్రతీ పాత్ర ఈ లోకం లోని ఒక్కో చీకటి కోణాన్ని చూపిస్తూ ఈ ప్రపంచం అసలు స్వరూపాన్ని బయట పెడుతూ ఉంటే .... భయం.... కోపం.... ఆవేదన... ఆక్రోశం ..... అన్ని కలిసిన ఒక emotional burst వచ్చేసింది ......కాఫ్కా రచనల్లోని పాత్రలు మనకి గానీ ఎదురైతే .... కఫ్కా వారి గురించి చెప్పిన ప్రతీ విశయాన్ని వ్యతిరేకిస్తారు .... కానీ వారితో మనసు విప్పి మాటాడితే మాత్రం వారు ఒప్పుకోక తప్పదు.


కాఫ్కా గురించి రాయాలి అంటే ..... ముందు కాఫ్కా అందించిన పాత్రలను అర్ధం చేసుకోవాలి ..... వారి జీ్వితాల్ని మరింత దగ్గర గా చూడాలి ..... వారి ప్రపంచం లో జీవించాలి ..... నాలా ఒకటిన్నర బుక్కులు చదివేసి ..... కాఫ్కా లో నాకు ఇది అర్ద్హం అయ్యింది ..... అది తెలిసింది అంటే వారు ఎంత లిటరరీ అంధకారం లో ఉన్నారో తెలుస్తుంది .....


లింకులు --- పెంకులు :

Project Gutenberg లో Metamorphosis

Metamorphosis Animation రూపం లో ఇక్కడ

Franz Kafka వికీ లో

Saturday, July 28, 2007

రీమేక్ సినిమాలు

వెంకట్ గారి 24fps లో రీమేక్ సినిమాల గురించి టాపిక్ రావడం దాని గురించి ఇక్కడ నా సొల్లు

అసలు ఏఏ సినిమాలు రీమేక్ .... దేనికి రీమేక్ అన్నది పక్కనెడితే రీమేక్ సినిమాలు ఎక్కడైనా మామూలే ... ఒక భాష లో సినిమా హిట్టయ్యి లేదా పేరొచ్చి (రెంటికీ తేడా ఉంది ) ఉంటే దాని వేరే భాష లోకి రీమేక్ / డబ్బ్ చేయడం మామూలు విశయం .... పారలల్ / ఆర్ట్ / నిజం సినీఫైల్స్ అయితే తప్ప ఇలాంటి వాటి గురించి మిగతతా ఎవర్రూ పెద్దగా బెంగెట్టు కోరు ... కోనవసరం లేదు కూడా .... వాళ్ళకి కావల్సింది ఎంట్రటైన్మెంట్ .... అది ఫుష్కలంగా దొరికితే మిగతా విశయాల గురించి వాల్లకెందుకు .... ఇక క్రియేటివ్ / సొంత కధల / వ్యక్తుల డ్రెత్ వల్ల మనకీ ఖర్మా .... బ్లా... బ్లా... అంటే నేనేమీ అనలేను .... కానీ అలాంటి వి తీసే వారు మన దేశం లో అసలు సిసలు సినీ వజ్రాలను తలదన్ని అత్యంత గొప్ప డైరెక్టర్ / ఆక్టర్ / ఫిలిం మేకర్ గా కీర్తింపబడితే మాత్రం అది మన ఖర్మే !! అయినా ఏ సినిమా అయినా మక్కీకి మక్కీ దించేయ లేరు గా ...వాటికి కూడా కల్చరల బారియర్స్ ఉంటాయిగా వాటికి చిన్న చిన్న మార్పులు చేయాలి గా .... ఆ మార్పులే ఈ క్రియేటివ్ దర్షకుల క్రియేటివిటీ కి కొలమానం ;) !!

కనీ ఈ రీమేక్ / ఇన్ స్పైర్డ్ సినిమా లా వల్ల కూడా కొంత లాభం ఉందనిపిస్తుంది .... ఇప్పటికిప్పుడు ఉదాహరణలు ఇవ్వలేను కానీ ... ఇంగ్లీష్ నుంచి డైరెక్ట్ గా రీమేక్ / ఇన్ స్పైర్ అయిన సినిమా ల వల్ల మన సినిమా .. కధా కధనాల ల లో కూడా కొంత బోల్డ్ నెస్స్ పెరిగింది , కొంత వరకూ స్టాండర్ద్స్ కూడా పెరిగాయి.

ఇక వెంకట్ గారి పోస్టు లొ చెప్పిన సినిమా విశయానికి వస్తే

మున్నాభాయ్ --- one flew over cuckoo's nest కి పోలికల కంటే కామెంట్స్ లో చెప్పినట్టు patch adams కే దగ్గర పోలికలు ఉన్నాయి , కానీ రాజ్ కుమార్ హిరాణి కూకూస్ నెస్ట్ చూస్తూనే కొంత ఇంస్పిరేషన్ మున్నాభాయ్ కధ తయారు చేసుకొని ఉండొచ్చు అది హిరాణి గారే చెప్పాలి !! బై ద వే మున్నాభాయ్ ని మీరీ నాయర్ క్రిస్ టకర్ తో కలిసి Gangsta M.D గా రీమేక్ చేస్తున్నారు అన్నారు ఎవయ్యిందో ??

పోకిరి ---- పోకిరి కి వెంకట్ గారు చెప్పినట్టు డానీ బ్రాస్కో కంటే యొజింబో కే పోలికలెక్కువ .... యొజింబో సీక్వెల్ సంజురో గురించి సౌమ్యా గారి బ్లాగు లో ఒక పోస్ట్.

సంతోషం ---- కుచ్చు కుచ్చూ ... కిది రీమేకా .... నేనా కుచ్చు కుచ్చూ ను చూడ లేదు ..... ఎందుకంటే నాకు ఆ జోహార్ అన్నా ఆ నత్తి షారుక్ అన్నా పరం చిరాకు .... I loathe those guys / gays ?? from bottom of my heart !!


నే ఒకప్పుడ్డూ ఆర్కూట్ లో బాగా బతికి నప్పుడు (అకౌంట్ ఉన్నప్పుడు ) ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి డైరెక్ట్ అయా రీమేక్ అయిన సినిమాల గురించి ఒక థ్రెడ్ మొదలెట్టా దాని లింకు ....

అబ్బా ఇప్పుడు దాన్లోకి లాగిన్ అవ్వాలా ..... ఇది గో ఆ లిస్టు (నో అప్డేట్స్ )

Remake cinemaalu
Telugu lo remakes common ee ayinaa ..
English lo nchi direct ga chesinavi takkuve ...
naaku telisina remakes ivi

Aithe --- Suicide Kings

Memento -- Gajini

Nick of Time --- Paape naa pranam

The Fugitive ---- Criminal

BABYS day out ---- Sisndri

My sassy Girl ---- Maa Iddari Madhya (inka release kaaledu)

City Of God ---- Sambhavami Yuge Yuge

super man ---- Super man (NTR)

chiranjeevi VETA --- count of mount cristo

POKIRI koncham inspired from DONNIE Brasco ..n' Yojimbo

chantabbai ---shot in d darkness

mallishwari (NEW) ----- 'roman holiday'.

mrugaraju ----- the ghost and the darkness(all those lion based scenes)

Kashmora (rajendra prasad) ---- konta varaku Exorcist

Atma Bandhu ---- Ghost

Anji ---- Indiana Jone Last crusade

satyame shivam(Kamal hasan and Madhavan ) is also not an original screenplay.. it was lifted from 'planes,trains and automobiles'(steve martin)

Stalin ---- pay it forward

ram gopal verma films annitlo God father inspiration , presence kanipistundi

Inka chaala unnayi anukuntaa ... telsite post cheyyandi .....

ps : నా చిర కాల కోరిక ఏదైనా తెలుగు లోకి డబ్ చేసిన ఇంగ్లీష్ సినిమా ని ధియేటర్ చూడాలి ..... ట్రైలర్స్ లోనే డైలాగులు అదిరి పోతాయి ... ఇక సినిమా అంటా అంతే దేవుడా ... కడుపు చెక్కల వుతుందేమో ;) ....

ps 2 : ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలంటే గుర్తొచ్చింది .... అప్పట్లో stealth అనే సినిమా కి తెలుగు టైటిల్ ఆకాశం లో భూకంపం అని పెట్టారు .... ఆకాశం లో భూకంపం ఏంట్రా బాబూ నీ బొంద పై నా బర్త్ డే లా .... అంటూ భలే నవ్వుకున్నాం !!

Tuesday, July 24, 2007

Noam Chomsky ధియరీ తప్పా ??

చోమ్ స్కీ చెప్పిన లింగ్విస్టిక్ ధియరీ తప్పా ?? తప్పనే అనే అంటోంది The New Yorker లో వచ్చిన ఈ వ్యాసం (article కొంచం పెద్దాగా ఉంది !!) , వ్యాస కర్త John Colapinto చెప్పేదాని బట్టి Pirahã language చోమ్ స్కీ చెప్పినట్టు linguistic అనేది , universal grammar and linguistic universals పై ఆధారం పడదూ , వారి వారి సనాతన సాంప్రదాయాల బట్టి వారి జీవన విధానం బట్టి ఉంటుంది , అంటూ Chomskyan linguistics ధియరీ / ఫిలాసఫీ మూలాలల్నే ప్రశ్నిస్తోంది !!

వ్యాసం లో చెప్పినదాని బట్టి Pirahã భాష లో రంగులు , నెంబర్లూ లాంటి universal abstractions లాంటి వాటికి చోటు లేదు, దీన్ని బట్టి వారి ప్రాపంచిక ద్రుష్టి empiricist గా కనిపిస్తోంది !! మాధ మెటికల్ గా చెప్పాలంటే Pirahã people are incapable of recursive thought.

నాకు ఈ Chomsky ధియరీ గురించి ఈ మధ్యే తెలిసింది , అంత లోనే దీని కౌంటర్ .... Darwinian evolution లో భాగంగా మానవ జాతి ఎదిగే దశల్లో మనం వీళ్ళ దశ ను దాటి ముందు ఉన్నా మా ?? , ఏవీ లేకుండా రికర్సివ్ లాంగ్వేజ్ ఎలా పుడుతుంది ?? Shakespeare హామ్లెట్ కి కుక్కల భౌ భౌ .... లింకులున్నాయా ??



లింకులు - పెంకులు :



Pirahã గురించి చేసిన రీసర్చి లో ముఖ్య పాత్ర వహించిన Daniel L. Everett ఇంటర్వ్యూ (must read)

THE NEW YORKER లో వ్యాసం

Pirahã language గురించి వికీ ఎంట్రీ

Chomsky ధియరీ కంటే ముందు వచ్చిన Sapir-Whorf hypothesis (ఇది కూడా Chomsky ధియరీ ని విభేదించేదే )

Pirahã గురించి చేసిన రీసర్చి లో ముఖ్య పాత్ర వహించిన Daniel L. Everett ఇంటర్వ్యూ

Update :

The New Yorker లో ఈ వ్యాసానికి సంభంధించి స్లైడ్ షో

ఈ ఫెనామెనన్ కి సంభంధించీ మరో ఆర్టికల్ ఇక్కడ

ఈ టాపిక్ గురించి నాకు అర్ధం అయ్యింది చాలా తక్కువ .... (మట్టి బుర్ర మరి ఏం చేస్తాం ) .... ఎవరైనా దీని గురించి మరింత xplain చేస్తే సంతోషం !! మూడు ముక్కల్లో రామాయణం కట్టే కొట్టే తెచ్చే (కట్టే = వారధి కట్టే , కొట్టే = రావణుడిని కొట్టే , తెచ్చే = సీతను తెచ్చే అన్నట్టు ) చెప్పినట్టు అలా చెబితే ఇంకా మంచిది.

Monday, July 02, 2007

గ్రహాంతర వాసులు

మొన్న మా ఫ్రెండ్ తో ఓ చిన్న డిబేట్ మొదలయ్యింది , గ్రహాంతర వాసుల ఉనికి తెలుసుకోవడానికి ఉన్న అడ్డంకుల గురించి ... కూసింత డిస్కషన్ ... కొసింత డిబేట్ ... ఆఖరుకు కొన్ని కంక్ల్యూసన్స్ ... మాకు తోచిన కొన్ని థాట్స్ ...

జీవం విశ్వం అంతా నిండి ఉంది . ఇన్ని కోటానుకోట్ల నక్షత్రాల లో ఒక్క దాంట్లో కూడా జీవం ఆవిర్భవించి బతికి బట్టకట్టలేదంటే సైన్సే ఒప్పుకోదు , అది కేవలం భూమి కే పరిమితం అయితే మాత్రం అదో పెద్ద మిరాకిలే ... కాబట్టి భూమి మీద కాకుండా మరి కొన్ని చోట్ల కూడా జీవం ఉండే అవకాశం లేక పోలేదు . కానీ దాని ఉనికి మనకు చేరడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ...

1) మన పాల పుంత లో నే జీవం ఉందనుకున్నా ... అది వేరే కాలానికి చెంది ఉండవచ్చు ... eg- Aliens ఒక 4 బిలియన్ సంవత్సారాల కింద ఉండి , ఇతర గ్రాహాంతర వాసుల కోసం అంటే మన కోసం వెతికితే మైక్రోస్కోపిక్ లెవల్లో కూడా మన జాడ వారికి తెలిసే అవకాశం లేదు ... కారణం భూమి మీద జీవం పుట్టి కేవలం 3.5 బిలియన్ సంవత్సారాలే అయ్యింది.

2) మన దురద్రుష్టం కొద్దీ మనకు Interstellar space లో చిన్న పాటి దూరాలు ప్రాయాణం చేయడానికి ఉన్న అవకాశాలు కూడా చాలా తక్కువ. ఒక Alien కమ్యూనిటీ మనమున్న టై ఫ్రేం లోనే ఉందనుకున్నా అది కాస్తా 30 వేల కాంతి సం. రాల(light years) దూరం లో ఉంటే మన చేసేది ఏవీ లేదు. అంత దూరం astronomical గా చూస్తే చాలా తక్కువ కానీ మనం చేరడానికి మాత్రం ఆస్కారం లేదు.

3) సరే ... ఆ Aliens కాస్తా మన టైం ఫ్రేం లోనే ఉండి , మనం చేరగలిగే దూరం లో ఉన్నా వారిని చేరుకోక పోవడానికి ఇంకో కారణం ఉంది. ఆ Alien కమ్యూనిటీ జీవం మనకు సంబధం లేని మరో form లో ఉండొచ్చు. అంటే వారి జీవం మనలా carbon బేస్డ్ గా కాకుండా silicon ద్వారా నిర్మితమై ఉంటే ఇప్పుడు మనచేసే బయలాజికల్ టెస్ట్స్ ద్వారా వారి ఉనికిని తెలుసుకోలేం ... మనం పంపించిన రోవర్స్ వల్ల కానీ మ్రే ఇతల sattileite vehicles ద్వారా కానీ ఇతర గ్రాహాల పై మైక్రోస్కోపిక్ లెవల్లో పరి్శొధనలు చేయడం కూసింత కష్టం.

కాబట్టి ఈ కష్టాలన్నీ గట్టెక్కి ఆ Aliens ని కనుక్కునే సరికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో ...


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పైన చెప్పిందంతా ట్రాష్ ... ఇప్పుడు అసలు నిజం చెబుతాను ....

అసలు నే ఈ గ్రాహానికే చెందినవాడిని కాదు ... MARS నుంచి వచ్చా .... yeah ... i'm a martian.

మా గ్రహం పై జనాభా ఎక్కువై పోవడం తో ఉండడానికి ఇతర గ్రాహాలేవైనా ఉన్నాయో చూడ మని మా మార్స్ ప్రభుత్వం కొంత మంది సైనికుల్ని పంపింది ... దాంతో వెత్తుకుంటూ నేను భూమిదకొచ్చి పడ్డా ... హ హా .... తొందరలో మా సైన్యం వచ్చేస్తుంది .... భూమి పై గెలిచి , ఆక్రమించేస్తాం ...... హి హ హ ......

(Marvin the Martian )

Monday, June 25, 2007

Nikolai Gogol


Letter to Gogol

కాఫ్కా(Franz Kafka) రాసిన The Castle లాగే గొగోల్ రాసిన Dead Souls ని కూడా ఒక unfinished masterpiece అంటారు , అది ఎందుకు unfinished గా మిగిలిపోయింది అన్నదానికి బోలెడు కధనాలు కూడా వినిపిస్తాయి , ఆయన దీని సీక్వెల్ రాసేపాటికి అయనలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువయ్యి తన రచన పై ఒక రకమైన dejection తో దాన్ని అలాగే పూర్తి చేయకుండా వదిలేసారు .పైగా రష్యా లో ఉన్న అప్పటి పరిస్థితులు ఆయన పై మరింత ప్రభావం చూపించి ఉండొచ్చు .

ఈ క్రమం లో నే ఆయన రష్యన్ రైతులను తిడుతూ Czar ని దేవుడి దూతగా గా కీర్తిస్తూ ఫేమస్ మరియూ కొంత నోటోరియస్ అయిన "Selected Excerpts from Correspondence with Friends" రాసారు. ఈ క్రమం లో Vissarion Belinsky అనే లిటరరీ క్రిటిక్ Gogol తను ఒక రచయిత అని మరిచిపోయి ఎలా ప్రవర్తిస్తున్నాడో చెబుతూ అతని రచనని తూర్పారబడుతూ ఒక పబ్లిక్ లెటర్ రాసారు. ఈ లెటర్ కి చాలా ఫేమస్ అయ్యింది , దీంతో గోగోల్ పై విమర్షల జడివాన మరింత పెరిగి ... ఆయన ఒక రకమైన black melancholy వెళ్ళిపోయాడు .... కానీ ఆయన రాసిన "The Cloak /The Overcoat " లాంటి నవలలు మాత్రం చాలా ఫేమస్ అయ్యాయి .... జుంఫా లాహిరి రాసిన "Namesake" లో The Cloak బుక్కే కధకి ఆధారం ...... Namesake ని అదే పేరు తో మీరా నాయర్ సినిమా గా కూడా తీసారు.
అందులో ప్రోటాగానిస్ట్ పేరు గోగోలే (Gogol).

"పొద్దు ” లో నికొలాయ్ గొగోల్ dead Souls ని తెలుగు లోకి అనువదిస్తున్నారని చూసా .... చాలా మంచి ప్రయత్నం ఆల్ ద వెరీ బెస్ట్ పొద్దు టీం !!

కొన్ని లింకులు :

Letter To Gogol full text ---- Letter To Gogol

Project Gutenberg లో Dead Souls ---- Dead Souls

The Cloak / The Overcoat ------ The Overcoat , full text

Sunday, June 24, 2007

అగ్నీ







ఇదో ఇండియన్ రాక్ బాండ్ గురించి .... పేరు .... అగ్నీ వీరు ఈ మధ్య రెలీస్ చేసిన "సాధో రే ...." పాట ఇండియన్ రాక్ అరీనా ని ఒక్క సారి గా ఊపేస్తోంది !! డీప్ అండ్ intense లిరిక్స్ మరియూ విసువల్ గా కూడా astounding గా ఉంది వీరి ఆల్బం . "సాధో రే ...." పాట కి కాబీర్ దాస్ రాసిన ఒక పాట మూలం. ఆయన రాసిన దాన్ని ఏ మాత్రం మార్చకుండా కేవలం ట్యూన్ కట్టారు ... ఎప్పుడో 400-500 సం వ రాల కింద కాబీర్ దాస్ లోకం గురించి రాసిన పాట అది .... ఇప్పటికీ మన పరిస్థితి అలాగే ఉంది అని ఈ సాంగ్ వల్ల మరో సారి నిరూపించారు అగ్నీ. అల్బం లో అన్ని పాటలూ బాగనే ఉన్నాయి ...Arijit , Koko (బేస్ గిటార్ ) , Mohan (వోకల్స్ ) తో కూడిన ఈ బాండ్ ... ఇండియన్ రాక్ అరీనా లో మరో ధ్రువ తార అనొచ్చేమో ... వీరు చాలా రోజుల్నుంచి ఉన్నా MTV Roadies కి ఇచ్చిన బాక్ గ్రౌండ్ మ్యూసిక్ తో lime light లో కి వచ్చారు. వీరి పాత ఆల్బంస్ ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు http://72hoytstreet.net/music/agni/ (ఇది కాపీ రైట్ ఉల్లంఘణ కాదు , ఎందుకంటే ఈ పాటలు బాండ్ మెంబర్ Koko అనుమతి తో నే net లో పెట్టారు :) )

Indian Rock అనేది indus creed అనే బాండ్ తో మొదలైంది అనొచ్చేమో ... Rock Machine కూడా కొన్ని రోజులు అలరించినా తరువాత పెద్దగా వినపడలేదు. ఈ మధ్య pentagram , parikrama , agnee , brahma లాంటి బాండ్స్ వస్తున్నా ఏవి నిలబడతాయో చెప్పలేకుండా ఉంది. అలా అని మనం ఏమీ మరీ చెండాలమైన స్థితి లో ఏం లేం Indian Ocean , Vaayu , GnarL లాంటి వారు అప్పుడప్పుడూ ప్రపంచ వ్యాప్తంగా తలుక్కు మంటూ నే ఉన్నారు ......



ఈ మధ్యే Indian Ocean వారికి లండన్ లో ప్రముఖ edingburgh రాక్ concert లో Dream Theatre, Slayer, Iron Maiden లాంటి వాళ్ళ తో కలిసి షో చేసే అవకాశం కూడా దక్కింది.
వీరి పై ఓ చిన్న రాక్యుమెంటరీ (Rocumentary = Rock Documentary) కూడా చేసారు యూ ట్యూబ్ లో ట్రైలర్

వీళ్ళే కాక కొన్ని ప్ర్రమిసింగ్ రాక్ బాండ్స్ కూడా వెలుగు లోకి వస్త్తున్నాయి.

మన హైద్రాబాద్ కూడా Rock లో మరీ వెంకబడేం లేదు మనకీ Sledge,Wreckage,After Death,Kamoflagodz,Stiffneck Syndrome,Microtone,Mask of Sanity.History Makers,Gnarl లాంటి బాండ్స్ ఉన్నాయి , ఈ మధ్యే EXAybuss అనే బాండ్ అనీష్ కురివిల్లా తీసిన "Confessions Of a flim maker " కి background మ్యూసిక్ కూడా అందించారు.

అగ్నీ బాండ్ యొక్క సాధో రే ..... లిరిక్స్ ఇక్కడ http://www.poemhunter.com/poem/tentacles-of-time/)

... పాట యూట్యూబ్ లో

http://www.youtube.com/watch?v=FBsiFhcTbc4


(ఈ బాండ్ పేరు అగ్ని (Agni) కాదు అగ్నీ (Agnee) కాబట్టి నే తప్పు రాసానని లొల్లి జేయొద్దు ;) )

Saturday, June 16, 2007

Animes , Rotoscoping ... et al ...

Waking Life (2001)
















Waking Life (వేకింగ్ లైఫ్ )
---- నాకు ఫిలసాఫికల్ / ఫాంటసీ / xtential సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ..... ఈ సినిమా కూడా పూర్తిగా వాటి తో నిండినదే .... అందుకే నచ్చేసింది ..

ఇది రోటోస్కోపింగ్ (Rotoscoping) అనే టెక్నిక్ తో తీసారు ... ఈ మధ్యే వచ్చిన A Scanner Darkly తీసిన Richard Linklater దీని డైరెక్టర్ కూడా ... A Scanner Darkly కి కూడా ఇదే టెక్నిక్ వాడారు.

ఇలాంటి కధ లకు Rotoscoping లాంటి ఆనిమేషన్ టెక్నిక్స్ వాడితే తప్ప తెరకెక్కించలేమనిపిస్తుంది. ఒక డ్రీం (కల ) నుంచి మరో డ్రీం కి మారుతూ ... extentialism ... Post modernism .... quantum theory .... ఇలా రక రకాల ఫిలాసఫిల లోకి మన మదడు ని దూరిస్తూ ... ఒక మైండ్ మాజిక్ క్రియేట్ చేస్తుంది .... దీంతో మన మెదడు లో ఎక్కడో ... నిద్రించుకుపోతున్న heterogeneous views ని తట్టి లేపుతుంది. ఈ సినిమా చూస్తే హ్యూమన్ సైకాలజీ , extential science , ఫిలాసఫీ మీద వంద బుక్కులు చదివిన ఫీలింగ్ కలిగింది. ఇలాంటి ఫీలింగే కొంత I Heart Huckabees లాంటివి చూసినప్పుడు కూడా కలిగినా , ఇది కొంత డిఫరెంట్ ... ఒక స్టాటిక్ స్పేస్ ( static space) నుంచి డైనమిక్ ప్లేన్స్ (dynamic planes)కి సాగే కధ ఒక రకమైన hallucinatory effect ని కలిగిస్తుంది. ఈ సినిమా కు Philip K. Dick రాసిన ఒక షార్ట్ స్టోరీ మూలం , నాకు Philip K. Dick కధలు పెద్దగా పరిచయం లేవు కానీ ఈ సినిమా ఇచ్చిన కిక్కుకు , ఆయన వర్క్శ్ కచ్చితంగా చదవాలని డిసైడ్ అయ్యా .... వీకెండ్ లో చాలా ప్రశాంతంగా ఉన్నఫ్ఫుడు ఈ సినిమా చూడండి ... ఒక ఇంక్రెడిబిల్ ఫీలింగ్ కలుగుతుంది .

Animes ----

నేను Animes ... Manga కామిక్స్ / సినిమాలకు పిచ్చా ఫాన్ ని , Animes అంటే అనీమేషనే కానీ ... కొంచం డిఫరెంట్ .... Pokemon , Animax చూసే వారికి ఇప్పటికి అర్ధం అయ్యుంటుంది .... ఎన్నో కల్ట్ (cult ) films కి Animes కామిక్స్ నుంచే ఇంస్పిరేషన్ ... అదర గొట్టే ఫైట్స్ తో జనాలని ఉదరగొట్టేసిని Matrix triology లో ఫైట్స్ కి , కొంత వరకూ కధ కి కి Ghost in the shell అనే Animes inspiration. Full metal alchemist , naruto , shaman king Animes / Manga సీరీస్ / కామిక్స్ ని ఫాలో అవుతుంటే కలిగే ఆనందమే వేరు .... ఇప్పుడీ నసంతా ఎందుకంటే .... మా కేబుల్ వాడు వారం నుంచి Animax ... చానెల్ ఆపేసాడు .... ఇవ్వారా బాబూ అంటే ఎంతకీ నా మొర ఆలకించడే ...

( Full metal alchemist పోస్టర్ )

















Random notes ...

బాల చందర్ సినిమా ఇది కధ కాదు ---- ఈ సినిమా ఎప్పుడూ పూర్తిగా చూడలేక పోయాను అది కొంచం బాధ పడే వాడిని ... నిన్న ఈ - టీవి వల్ల అది కాస్త తగ్గింది.
నిన్న ఈ - టీవి వాడు ఈ సినిమా మిని మూవీ పేరు తో వేసారు , అంటే 2 1/2 గంటల సినిమా ని అక్కడక్కడ కట్ చేసి 1 గంట లో చూపించేసాడు.
సినిమా లో స్టోరీ భలే ట్విస్టులు తిరిగింది .... అంత మంచి డిరెక్టర్ కాబట్టి ... అన్ని ట్విస్టులు ఉన్నా కధ లో పట్టు ఉంచ గలిగారు బాల .... పాత్రల కారెక్టరిజేషన్ కూడా బావుంది.
ముఖ్యంగా .... సినిమా మొత్తం మనసు ఊగిసలాడుతూ సాగే జయ సుధ పాత్ర బావుంది , శరత్ బాబు అంత పంచీ గా అనిపించక పోయినా ... కమల్ హాసన్ .... చిరంజీవి ... సూపర్ ...
మళ్ళీ చెప్పాలంటే ... చిరంజీవి సూపరో సూపర్ ...... ఈ సినిమా కూడా అంతు లేని కధ లాగే దేని నుంచి అయినా ఇంస్పిరేషనో కాదో తెలియదు.