పాత అడ్వర్టైజ్మెంట్లు
ఇవ్వాల చానెల్స్ మారుస్తూ ఉంటే సడన్ గా TIMES NOW లో పాత బజాజ్ ఆడ్ వస్తుడడం తో ఆగిపోయాను చూస్తే హమారా బజాజ్ ఆడ్ ఇంకా గుర్తు రాలేదా అదే నండి
"బులంద్ భారత్ కి బులంద్ తస్వీర్ .....హమారా బజాజ్ .... హమారా బజాజ్ ...హమారా బజాజ్ ... "
అంటూ చిన్నప్పుడు ఎప్పుడూ పాడుతూ ఉండేవారు ... అప్పుడే మర్చి పోయారా ఎలా మర్చి పోతారు లెండి ... మొత్తం దేశం నోట్లో ఎన్నో సం. వా ల పాటు నానిన జింగల్ అది . ఇప్పుడు బజాజ్ కున్న బ్రాండ్ ఇమేజ్ కి ఆ ఆడ్ ఎంత తోడ్పడిందో ఊహించవచ్చు .
ఆ ప్రోగ్రాం లో ఇంకొన్ని మరచిపోలేని పాత ఆడ్స్ గురించి ఇచ్చాడు , చాలా బావుంది ప్రోగ్రాం కాక పోతే సగం నుంచే చూసాను , ప్రోగ్రాం పూర్తి అయినా మనసెందుకో ఊరుకో లేదు , పెన్నూ పేపరూ ముందేసుకుని నాకు గుర్తున్న పాత ఆడ్స్ అన్ని లిస్ట్ రాసుకుంటూ వెళ్ళాను అదే ఈ లిస్టు , ఇంటెర్నెట్ లో వెతికితే కొన్నిటి వీడియోలు కూడా దొరికాయి
YOU TUBE లో హమారా బజాజ్ వీడియో ---- http://www.youtube.com/watch?v=oWFSG0YL_mM
ఇక నాకు గుర్తున్న ఆడ్స్ కొన్ని
బజాజ్ బల్బ్స్ ---- " జబ్ మే చోటా బచ్చా తా బహుత్ శారారత్ కర్తా తా ..."అనే ఆడ్ గుర్తుందా ?? ఈ ఆడ్ నేను పెద్ద గా చూసింది లేదు , దీని జింగిల్ మాత్రం ఇప్పటికీ హం చేస్తూ ఉంటాను . ఒక వ్యక్తి తన చిన్నపటి నుంచి ముదుసలి అయ్యే వరకూ తన జీవితం లో బజాజ్ బల్బ్స్ గురించి చూపిస్తూ పాడుతుంటాడు , భలే గా ఉంటుంది పాట .... దీని లిరిక్స్ దొరికాయి కాని వీడియో దొరక లేదు ... స్చ్ ...
ఏక్ అనేక్ ఏక్తా --- టైటిల్ చూస్తే ఈ పాటికి గుర్తొచ్చేసి ఉంటుంది .. సూరజ్ ఏక్ చందా ఏక్ తారే అనేక్ హై ... అంటూ ఒక అక్క తన తమ్ముడికి మన దేశం వివిధ జాతుల ,మతాల ఐకమత్యం గురించి కల్చర్ గురించి చెప్పే ఈ ఆనిమేటెడ్ ఆడ్ ని ఎవరు మర్చి పోగలరు , ఇది 1978 లోనే 80 వేల బడ్జెట్ తో తీసరంటే ఆశ్చర్యం వేస్తుంది .
ఈ ఆడ్ ఆడియో లింకు --- http://as01.coolgoose.com/music/song.php?id=96973
వీడియో లింకు --- http://www.youtube.com/watch?v=JukuUNk_cRs
మిలే సుర్ మేరా తుమారా ---
మన దూర దర్శన్ (రెండు రెండ్ల ఆరు గారి ప్రకారం దూల దర్శన్ :) ) ఈ ఆడ్ తీసింది అంటే చాలా మంది నమ్మరేమో . మొత్తం భారత దేశం లోని సంగీత , నటనా కళాకారులను ఒక చోట చేర్చారు ఈ పాట కోసం ... ఈ పాటకి ట్యూన్ కట్టింది ఎవరో ఖాన్ అని గుర్తు , బిస్మిల్లా ఖాన్ గారు అని అనుకుంటున్నాను ..సరిగ్గా గురు లేదు .. దీనికి లిరిక్స్ రాసింది మాత్రం చల్ మేరీ లూనా ... భారత ఆడ్ ఇండస్ట్రీ ని మరో మలుపు తిప్పిన ద గ్రేట్ పియూష్ పాండే.
దీని వీడియో లింకు --- http://www.youtube.com/watch?v=k7OkWpfTz1U
ఇందులో మంగళం పల్లి బాల మురళీ క్రిష్ణ గారి --
" నీ స్వరమూ నా స్వరమూ సంగమమై ....
మన స్వరంగా అవతరించే .. " అనే తెలుగు లైన్ నాకు ఇప్పటికీ గుర్తే .
నిర్మా -- నేను ఇప్పటికీ పాడుకునే మరో ఆడ్ జింగిల్ నిర్మా వాషింగ్ పౌడర్ ది .. వాషింగ్ పౌడర్ నిర్మా ... శంకర్ దయాల్ శర్మా ... నాకు స్కూల్ లో ఇలా పాడడమే గుర్తు అసలు పాట ఎప్పూడో మర్చి పోయా.
అమూల్ -- వీళ్ళవి చాలా వరకూ ప్రింట్ ఆడ్స్ అయినా నాకెందుకో విపరీతంగా ఇష్టం ,ఆడ్ల ల లో వీళ్ళ సటైర్లు అల్టిమేట్ అసలా ... ఇక ఆ బుజ్జి పాప బొమ్మ అయితే ఎంత ముద్దుగా ఉంటుందో ... వీళ్ళ ప్రింట్ ఆడ్స అన్నీ www.amul.com లో చూడొచ్చు.
వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ --- ఏంటీ పాప ఏడుస్తుందా .... అయితే వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ పట్టు
ఇది కూడా మరో మంచి ఆడ్ .
రస్నా --- ఐ లవ్ యూ రస్నా ..... అంటూ బుజ్జి అంకిత చెబుతుంటే ఇప్పటికీ గుర్తే ... కాక పోతే పాపం సినిమాల్లో ఇప్పుడు అదే సైజు డ్రెస్సులు వేస్తుంటే బాధేస్తుంది . కాక పోతే సూపర్ ఆడ్ .
ఓనిడా దయ్యం ---- చిన్నప్పుడు అన్నం తినక మారాం చేస్తే ... ఓనిడా దయానికి పట్టిస్తా నంటూ
అమ్మ బెదిరించేది :) , ఎందుకో మధ్య లో ఆపేసి మళ్ళీ ఈ మధ్య మొదలెట్టారు ఈ దయ్యాన్ని .
ఓనిడా దయ్యం అంటే వెంట నే గుర్తొచ్చేది ముగ్గురు గుండూ రావుల మిరిండా ఆడ్ ఇది కూడా సూపర్ గ ఉంటుంది , యూ ట్యూబ్ లో ఇప్పటికీ కనిపిస్తుంది .
లిరిల్ ----- లా .. ల ల ల లా ... ల ల ల లా ... ల్ల ల్ల ల్ల .. ల్ల ల్లా ల్లా.... అంటూ అప్పటి కేరెన్ లూనెల్ నుంచీ మొన్నటి దీపికా పదుకొనే వరకూ ... వాటర్ ఫాల్స్ కింద పాడేసి ... మన చేత సబ్బును కొనిపించేసారు ... ఈ ఆడ్ ని డిజైన్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ అలెక్ పద్మసీ .
సొట్ట బుగ్గల ప్రీతీ జింటా కూడా ఒకప్పుడు లిరిల్ గర్లే ..
ఇక ఫెవికాల్ ఆడ్స్ ని ఎలా మర్చి పోతాం నవ్విస్తూనే చెప్పల్సింది చెప్పేస్తారు ఈ ఫోటో చాలు అది ప్రూవ్ చెయ్య డానికి
మరిన్ని ఫెవికాల్ ఆడ్స్ www.pidilite.com లో చూడొచ్చు !!
మర్చి పోయాను ఆ ప్రోగ్రాం చూస్తుంటే మరో కొత్త విశయం తెలిసింది ... నిన్న మొన్నటి వరకూ I am a COMPLAN boy , I am a COMPLAN girl అంటూ మనతో కాంప్లాన్ తాగించింది ఎవరో కాదు ఆయేశా టాకియా , షాహిద్ కాపూర్లే ..
ఇలాంటివే బోల్డు ..... సూపర్ ఆడ్స్ అప్పటికీ ఇప్పటికీ గుర్తుండి పోతాయి ....
వెళ్ళే ముందు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ... వీడియో లేకుండా ..కేవలం మాటలతో నే ... అజరామరమైన చార్మినార్ రేకుల ఆడ్
ఏంటి రామయ్యా ధీర్ఘాంగా అలోచిస్తున్నావ్ ??
ఏం లేదు , మా ఇంటికి ..గొడ్ల సావిడి కి ఏ రేకులు వెయ్యాలా అని ...
ఇందులో అలోచించడానికి ఏవుంది ... నాణ్యమైన వీ మన్నికైన చార్మినార్ రేకులనే వాడు ....
చార్మినార్ ..... చార్మినార్ .....


10 కూతలు:
చిన్నప్పటినుండి నాకు టీవీతో పెద్దగా సంబంధంలేకపోవడం వల్ల వీటిలో చాలా వరకూ పోల్చుకోలేకపోయాను. అయితే, రేడియో శ్రోతను కాబట్టి చార్మినార్ రేకులు, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్‌బోయ్, మీ పాప లేత నాజూకు పొట్టకు ఉడ్‌వర్డ్స్ గ్రైప్‌వాటర్, వాషింగ్ పౌడర్ నిర్మా, గంగా వాటర్ ఫిల్టర్, జండూబామ్ జండూబామ్ నొప్పి హరించే బామ్, తలనొప్పి పంటినొప్పైన అనసిన్ తీస్కో అనసిన్, డాబర్‌లాల్ దంతమంజనం ముఖమును కళకళలాడించే, అందరు మెచ్చే వక్కపొడి క్రేన్ వక్కపొడి ఇలా చాలా గుర్తొచ్చాయ్ మీ టపా చదివి. థాంక్యూ.
అవునండీ బాబూ...
ఎంత మంచి ఆడ్స్ కదూ. ఇంతకు ముందు నేను కూడా వీటి మీద పోస్టు రాసినట్టు గుర్తు. ఇక్కడ కాదు లేండి.
ఈ వీడియోలన్నీ ఒక బ్లాగు మొదలెట్టి అందులో పెట్టకూడదూ, సరదాగా ఉంటుంది. నేనూ లింకులు పంపిస్తా లేండి.
ఒక్కసారి యాడ్ ప్రపంచం తిప్పి తీసుకొచ్చారు. ఇప్పటికీ మాఇంట్లో ఎవరైనా ఆలోచిస్తూకూర్చొంటే, చార్మినార్ యాడ్ వచ్చేస్తుంది.
ఇడ్లి ఉప్మా దోస దహివడ గరంపకొడ.. యెం తెమ్మంటారు...
ఇడ్లి వేడిగ వుంద
అహ యేమి తెలుపు
యేమిటి
మీ షర్టు
నా షర్టా
యెలా వుతికారెం
సూపర్ రిన్ తొ
సూపర్..
రిన్
థళ థళ లాడె తెలుపు
మరింథ తెల్లని మెరుపు
@ ప్రవీణ్ గార్లపాటి
అవును మంచి అవిడియా , ఈ పోస్టు రాసిన
తరువాత మరిన్ని పాత ఆడ్స గురర్తొచ్చాయి
అన్నీ కలిపి పెట్టేస్తే భలే ఉంటుంది !!
@ రానారె
లైఫ్‌బోయ్ ని ఎలా మర్చి పోయానో అర్ధం కావట్లేదు , గుర్తు చేసింనందుకు ధాంక్స్ :)
బజాజ్ ఏడ్స్ మన సాంప్రదాయాలు కొద్దిగా కనిపిస్తూవుంటాయి కదా.మేము ఎక్కువగా చిన్నప్పుడు వాడుకున్న ఏడ్స్ వాషింగ్ పౌడర్ నిర్మా ,లైఫ్ బోయ్,సంతూర్ సంతూర్,ఐ లవ్ యు రస్న... చాలా బాగుందండి మీ పోస్ట్.
Alanati gurthulani malli taja chesaru... meeku chala thanks... When i was working in India, my day starts with Janaranjani with ads like Charminar, Nirma, dabar, etc. Tv ads lo naa favourite Liril, Bajaj, Sylvania Laxman bulbs, Santoor soap lo ammai valla ammani choopi cheppe dialogue. " Challe idi maa Amma!!". maa tammudu ippatiki (he is 25) a dialogue vadutuntadu...
Thanks again
భలే పోస్టు! కొన్ని ప్రకటనలు గుర్తుకొచ్చాయి మీ పోస్టు చదవగానే. వీకో వజ్రదంతి ఒకటి - ముఖ్యంగా సినిమా హాళ్ళలో అరగదీసి ఆరేసారు దాన్ని. చూసీ చూసీ చాలా చిరాకొచ్చేది. దాని మీద ఓ బూతు పాట కూడా ఉండేది (కొంత గుర్తుంది గానీ, రాయడం పద్ధతి కాదు గనుక రాయడం లేదు). అలాగే నాలుగు భాషల్లో వచ్చే త్రివేణి వక్కపొడి ప్రకటన కూడా గమ్మత్తుగా ఉండేది. "పోనీ పత్తు పైసా త్రివేణి పాకుదల పాకెట్టు కూడిందా" అని అదేదో భాషలో వచ్చేది. హిందీలో "దో సౌ గ్రామ్ కా.." అంటూ వచ్చేది. అన్నీ విన్నాక.. ఏంటి త్రివేణీ వక్కపొడికి ఇంత డిమాండా? అని తెల్లబోతాడు కొనుగోలుదారుడు!
అలాగే చిన్నప్పుడు జనరంజనిలో వచ్చేది.. "మమతా వారి సమయం తొమ్మిది గంటలు" అని. టైమును మమతా వారిది అంటదేంటి అని అనుకునేవాణ్ణి కొన్నాళ్ళు. తవ్వితే చాలానే గుర్తొచ్చేలా ఉన్నాయి!
ముసలి తనం వచ్హేక గతం గుర్తు చేసుకుంటూ .......
Post a Comment