Monday, April 30, 2007

మణి రత్నం






ఈ పోస్ట్ రాయడానికి కారణం వెంకట్ గారి 24ఫ్రేములు, 64కళలు లో మణి రత్నం పై రాసిన ఆర్టికల్ , ఆయన దాన్ని పూర్తి చేయక ముందే నేను రాయడం తప్పనుకోండి కానీ ఎందుకో మనసాగలేదు , కారణం నేను మణి రత్నం గారిని మరీ అంత గొప్ప డైరెక్టర్ గా చూడక పోవడం , ఆయన కాస్త overhyped, overrated అనిపిస్తుంది , ఆయన కచ్చితంగా మంచి డైరెక్టరే ,కానీ నాకెందుకో ఆయన సినిమాలు కొన్ని మరీ గొప్పగా అనిపించలేదు !! కబట్టి అందరూ మొదట ఆ మంచి ఆర్టికల్ చదివి ఈ సుత్తి కి రండి !!

మణి రత్నం మొదటి నాలుగు సినిమాలు నేను చూళ్ళేదు (పల్లవి అనుపల్లవి , ఉన్నారు , పాగల్ నిలవు , ఇదయ కోవిల్ ) కాబట్టి వాటి మీద నో కామెంట్స్ .

మౌన రాగం --- చాలా డీసెంట్ సినిమా , ఇలాంటి సినిమాలు తెలుగు లో కూడా అప్పటికీ చాలా వచ్చినా , స్క్రీన్ ప్లే పరంగా .. ఇది కాస్త ఎడ్జ్ ఓవర్ విన్నర్ .. వెంకట్ గారనట్టు అప్పట్లో వచ్చిన మరో తమిళ సినిమా కు ఇది కొంత కాపీ అని విన్నాను , దీని తరువాత ఆయన చాలా సినిమాలు ఇతరుల సినిమాలనుంచి inspire అయినవే , కొంత వరకూ కాపీ కూడా అనొచ్చు !! నన్ను అడిగితే అదే అంటాను !! రేవతి గారి ఆక్టింగ్ ఇందులో నిజంగా సూపర్ !! shez one of my fav actors in indina cinema.


నాయకన్ --- ఎవరెన్ని చెప్పినా .. నేను మాత్రం ఇది కచ్చితంగా గాడ్ ఫాధర్ కాపీ అనే అంటాను, అందులో ఒక ఇటాలియన్ అమెరికా లో మాఫియా డాన్ గా ఎదిగితే .. ఇందులో ఒక మదరాసి .. బాంబే లో డాన్ గా ఎదుగుతాడు , ఇక ఇందులో సీన్లు చాలా వరకు మక్కీ కి మక్కీ దించక పోయినా ...స్క్రీన్ ప్లే ... టేకింగ్ ... ఇలా చాలా వరకు కాపీ యే ... కాపీ అయినా ఇండియన్ నేటివిటీ కి ఈ సబ్జెక్ట్ ఆపాదించి తీసి హిట్ చెయ్యడం గొప్ప కాదా అనవచ్చు .... కచ్చితంగా కాదు ... గాడ్ ఫాథర్ లాంటి సబ్జెక్ట్ , విభిన్న జాతూల తో ఒక మిని ప్రపంచం గా అలలారుతున్న మన భారతదేశానికి అతికినట్టు సరిపోతుంది .. కాబట్టి అందులో గొప్ప దనేమీ లేదు ... ఆ మాటకొస్తే మణి రత్నం కంటే రాం గోపాల్ వర్మా నే కొంత వరకూ బెటరూ ... ఆయన కనీసం సర్కార్ , నన్ను inspire చేసిన గాడ్ ఫాథర్ కి ఫ్రాంసిస్ ఫోర్డ్ కొప్పోలా కి నేను అర్పిస్తున్న గురు దక్షిణ అని ప్రకటించుకున్నారు ... మణి మాత్రం అది కాపీ కానే కాదు అని మంకు పట్టు పడుతున్నాడు .
పైగా నాయకన్ TIME ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఫిలంస్ ఎవర్ మేడ్ లిస్ట్ లో ... ఉంది దీనికి కచ్చితంగా ఆ అర్హత లేదు ... అందులో డౌట్ లేదు .

ఘర్షణ / అగ్ని నక్షత్రం ----- అసలు ఈ సినిమా ఎందుకు తీసాడో మణి రత్నానికే తెలియాలి , బేకార్ సినిమా నన్ను అడిగితే ... ఇందులో హాస్పిటల్ సీన్ లో ప్రభు , కార్తీక్ వాళ్ళ నాన్న ని రూం మార్చి , మెట్ల దగ్గర కాపు కాసే సీన్ .. గాడ్ ఫాథర్ నుంచి మక్కి కి మక్కి దించేసారు మణి 'రతనం' గారు .....

అంజలి ---- ఈ సినిమా కు ఒక ఇంగ్లీష్ నవల ఆధారం , కొన్ని సీన్లు స్పీల్ బర్గ్ E.T నుంచి inspire అయ్యాయి , ఇందులో చిన్నారి షామిలీ అక్టింగ్ నిజంగా సూపర్ , రేవతి సినిమా కి మరో అసెట్.

దళ పతి ---- ఈ సినిమా లో ని రజనీ , మమ్ముటి , అరవింద్ స్వామీ పాత్రలు మహా భారతం లో కర్ణుడు , ధుర్యోధనుడు , అర్జునుడి పాత్రలను తలపిస్తాయి , కధ కూడా కొంత వరకూ అలానే ఉంటుంది , ఇందులో మమ్ముటి పాత్ర మధ్యలో వీక్ అయినట్టు అనిపిస్తుంది , కొంత సైకోటెరిక్ గా కూడా అనిపిస్తుంది . దీని పై 1960's లో వచ్చిన హాలీవుడ్ గాంగ్ స్టా సినిమాల ప్రభావం చాలా వరకూ ఉందనిపిస్తుంది .


గీతంజలి ---- ఒప్పుకుంటా ... ఈ సినిమా నిఝాంగా చాలా బావుంటుంది ... పైగా ఇందులో నాగార్జునా ఉన్నాడు అందుకే నో కామెంట్స్ . ;)

రోజా --- దళ పతి మహా భారతం నుంచి inspire అయినట్టే ఇది మైధలాజికల్ కారెక్టర్ సావిత్రి కధ నుంచి inspire అయ్యింది , కాక పోతే అక్కడ యముడు , ఇక్కడ టెర్రరిస్టు , అందులో సావిత్రి పట్టు దల చూసి యముడు కరిగి పోతే ... ఇక్కడ అరవింద్ స్వామి మాటలకి టెర్రరిస్టు
ice అయి పోయాడు ... కానీ ఇందులో జెండా తగుల బెట్టే సీన్ చూస్తే మాత్రం ... రక్తం ఉడికి పోతుంది .

దొంగా దొంగా --- రాం గోపాల్ వర్మా , మణి రత్నం కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నరంటే ... అది ఏ రేంజి లో ఉందో అనుకుంటాం , నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సూపర్ గ ఉంది అనిపించింది , కానీ ఇప్పుడు చూస్తే ... యా....క్ ....

బాంబే ---- హమ్ ..మ్.....మ్..మ్ ఈ సినిమా కి ఏం వంకలు పెట్టొచ్చబ్బా ?? ;) , రియల్ ఇంసిడెంట్ నుంచి inspire అయ్యింది ... పైగా చాలా మంచి వర్క్ ... కాబట్టి నో కామెంట్స్ .

ఇద్దరు --- తమిళ నాడు రాజకీయల ఆధారంగా తీసిన సినిమా ఇది !! పర్లేదు బానే ఉంటుంది !!
చాలా చోట్ల కధ మరీ పర్సనలైజ్ చేసినట్టు అనిపించింది , కధనం కూడా స్లో .... ముఖ్య పాత్రల మధ్య వైరం కూడా సినిమాలో వేగం తేలేక పోయింది !!

దిల్ సే --- చూళ్ళేదు , నో కామెంట్స్ !! :)

సఖి --- పర్లేదు మంచి సినిమా ... కాక పోతే .. ఇలాంటి వి బోల్డొచ్చాయి కాబట్టి లైట్ .. :)

అమ్రుతా --- తమిళ టైగర్ల పోరాట నేపధ్యం లో సాగుతుంది ... మొదటి అర్ధ గంట తరువాత సినిమాలో వేగం పెరిగింది కానీ , ప్లాట్ లో ని కాంప్లెక్సిటీ సరిగ్గా హండిల్ చెయ్య క పోవడం వల్ల నేమో మధ్యలో డైల్యూట్ అయినట్టు అనిపించింది !!
కానీ ఇందులో మాధవన్ , సిమ్రాన్ పాత్రలు చాలా బాగున్నాయి , సిమ్రాన్ ఒక తల్లి గా తన అమ్రుతకు సహాయ పడుతుంటే .... మాధవన్ మాత్రం తన రీసెర్చి కి కూడా పనికివస్తుంది అన్న రీతిలో ఉంటాడు , ఒక డెడికేటెడ్ రచయిత , తన లోని తండ్రి పాత్రను అధిగమించి అమ్రుత కు సహాయ పడుతుంది !!

యువ --- ఈ సినిమా లో హీరోల ఇంట్రడక్షన్ సీన్ చూసి అందరూ ... మాకి కిరి కిరి ఏం తీసాడు మావా అన్నారు .. తీరా చూస్తే మెక్సికన్ సినిమా అమెరోస్ పెరురోస్ నుంచి కాపీ పేస్ట్ చేసారు ... సరే ఆ సీన్ వదిలేసి సినిమా అన్నా గొప్పగా ఉందా అంటే అదీ లేదు .... పాలిట్రిక్స్ లో యువత అనే మంచి కాచీ సబ్జెక్ట్ తీసుకొని ఊదేసారు , సినిమా లో బేసిక్ ఎలిమెంట్స్ చాలా మిస్స్ అయినట్టు అనిపించాయి .

గురు --- Orson Welles తీసిన సిటిజన్ కేన్ చూసొచ్చి ఈ సినిమా చూడండి , కధా కధనాలు వేరైనా ... కారెక్టర్ పరంగా ... విజువల్స్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని సారూప్యతలు ఉన్నాయో మీరే గడ గడా చెబుతారు , ఇక అభిషేక్ అయితే Orson లాగా ఆక్ట్ చేడానికి తెగ కష్టపడ్డాడు పాపం , ఇందులో లైటింగ్ టెక్నిక్స్ అంతకు ముందే వచ్చిన స్పీల్ బర్గ్ సినిమా మ్యూనిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ ని గుర్తుకు తెస్తాయి . దీన్ని ధీరూ భాయి అంబానీ జీవితం ఆధారంగా తీసారు. ఎందుకో నాకు పెద్దగా నచ్చలేదు !! ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళు బయోగ్రఫీ సినిమాలు తీయలంటే ఇంకా చాలా ఎదగాలి !! ఈ సినిమా ఈ సం వ మన దేశం తరుఫున ఆస్కార్ కి పంపిస్తారట , చూద్దాం ఏ చేస్తాడో మన గురూ గారు !!

మొత్తానికి నే చెప్పేదేంటంటే మణి రత్నం కచ్చితంగా ఇండియా లో ఉన్న గొప్ప ఫిలిం మేకర్స్ లో ఒకరు కానీ ఆయన కున్న పేరు చాల వరకు Hype మాత్రమే , మరీ అంత ఒరిజినాలిటీ క్రియేటివిటీ ఏం లేవు , అలా అంటే గొప్ప గొప్ప దర్శకులు చాల మంది నిజ జీవితం లోని సంఘటణల నుంచే స్పూర్తి చెంది సినిమాలు తీసారనుకోండి , కానీ ఎందుకో మణి ని అందులో చేర్చ బుద్దికావట్లేదు .. పైగా ఆయన సినిమాల్లో ఇళయరాజా , బాలూ మహేంద్రన్ , పీ సీ శ్రీ రాం , శ్రీకర్ ప్రసాద్ లాంటి వారి పాత్రలు మరువలేనివి. నన్ను అడిగితే ఆయన మంచి డైరెక్టర్ కంటే మంచి మార్కెటింగ్ నిపుణుడు అంటాను నేను ... దాని కి గురూ మార్కెటింగే సాక్ష్యం , 12 కోట్ల తో తీసిన సినిమాకి రిలీజ్ కాక మునుపే పాతికోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టున్నాడు మరి ... మణి రత్నమా మజాకా ....


PS : ప్రతీ విశయాన్ని వంకర బుద్ది తో చూసే వారు ఉంటారు , కొంత వరకూ అయితే క్రిటిక్ అంటారు , మరీ శ్రుతి మించితే సినిక్ అంటారు , కాబట్టి నా లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు , కాబట్టి వళ్ళని లైట్ తీసుకొని ఆమిర్ తో మణి గారి నెక్స్ట్ సినిమా లజ్జో కి రెడీ అవ్వండి !!

PS 2 : This post is not inteneded to hurt any ones feelings , every thing above quoted and said are strictly my personal opinions not intended to hurt any one , or degrade any one , but if any one still feels hurted .. I DON'T CARE ;)

11 కూతలు:

Anonymous said...

nAvi kUdA same feelings andy.. chala varaku naaku ilaane anipistundi.. good analysis..

radhika said...

మీరు చెప్పేవి నిజమే అయినా ఒప్పుకోడానికి మనసు అంగీకరించడం లేదండి.

Krishh Raem said...

@ anonymous

Voila , I waz expecting at least one anonymous
comment for this post , and here it is !!

అపరిచితులు గా పోస్ట్ చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదండి బాబూ , ఎవరేమనుకుంటే మనకేంటి ... మన అభిప్రాయాలు ఇతరుల మీద రుద్ద నంత వరకు ..మనకేం ప్రాబ్లం లేదు !! కాబట్టి మీ అభిప్రాయాలను నిర్ద్వందంగా చెప్పొచ్చు .. బ్లాగులున్నవే అందుకు !! మనం ఇతరులకు నచ్చక పోతే అది వారి ఖర్మ దానికి మనమేమి చేయగలం !! కాబట్టి అనానిమస్ కామెంట్ లు అనవసరం !!

రాకేశ్వర రావు said...

మణిరత్నం సినిమాలలో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది.
creativity, originality పరంగా చూస్తే ఈయని కంటే గొప్ప దర్శకులు భారతదేశంలోనే చాలా మంది ఉన్నారు.
కథాంశం మంచిది ఎన్నుకొని, చాయాగ్రహణం కలుపుతారు. మంచి దర్శకులు కరువైన దేశంలో గుడ్డిలో మెల్ల అన్నట్టు..

నాగరాజా said...

చక్కటి టపా. నేను మీతో ఏకీభవిస్తాను.

S said...

మంచి అనాలిసిస్ చేసారు.
కానీ, మణిరత్నం గొప్ప డైరెక్టర్ అని నేను అనను కానీ - I enjoyed almost all his movies, which I saw. He is a commercial director...not a classic director.He makes very much watchable movies.Yeah, even I feel he is over-hyped. ఇంతకీ నాయగన్ వరదన్ అన్న ముంబై డాన్ మీద తీసినది అంటారు కదా ... మీరు గాడ్ఫాదర్ అంటారేమిటి? - ఇవన్నీ ఏమో కానీ ... సినిమా ని ప్రెక్షకుల మనసు కు హత్తుకునేలా తీయడం ఎలాగో ఈయనకి బాగా తెలుసు. Yeah!, ఈయన విజయం లో తక్కిన వారందరి పాత్రలూ మరువలేనివి ... Illayaraja, p.c.sriram, Balu mahendran, All the cast of his movies.. like Kamal in Nayagan, Revathi in many others, Shamili in Anjali etc etc... to mention a few... వీరంతా లేకుంటే ఈయన సినిమాలు ఇంతగా జన బాహుళ్యం లోకి చేరేవా అన్నది అనుమానమే. Good article anyways...

మాకినేని ప్రదీపు said...

ఉవును మనిరత్నం తన సినిమాలను బాగా మార్కెట్ చేసుకోగలడు. అంజలి, గీతాంజలి మరియు బాంబే సినిమాలు నాకు చాలా బాగా నచ్చాయి. వీటిని నేను ఎన్ని సార్లు చూడ మన్నా చూస్తాను. కానీ మిగతావి బాగున్నాయా, బాగాలేవా అనేది చెప్పటాకి కష్టం.

Giri said...

Guru and Citizen Kane? I think that's stretching imagination a little too bit thin :)
Shyam Benegal's Zubeidaa looks and feels like a closer cousin to Citizen Kane..

Guru has other flaws, but similarity (or plagiarism) from Citizen Kane isn't one - that's my opinion.

My take on Guru here

Pallu said...

Wow
excellt analysis ..
What i beleive is everything in this world is get inspired from another thing..only mother nature is the original
meru chepina points correct gane vunayi kani ayana screenplay, music enchukune teeru, characterisation chala baguntayi ...
correctee p.c sriram, ilayaraja, santosh sivan ..vella sahayam to tana cinema la ki manchi publicity and marketing chesukunadu

Japes said...

The first reaction i got as soon as i read this post was "WOWWW !"

I'm a great fan of Mani... i'd cut of my limb if he'd ask me to do it ... but later after reading the post i felt "i never heard this side of the story of Mani picking up ideas from other movies" (ofcourse everyone knows 'Nayakan' was an adaptation of GodFather)

i concurr with 'Pallu' ..'What i beleive is everything in this world is inspired from another thing..only mother nature is the original'...

Mani might have picked up / directly copied from foreign movies... lets Zoom back & look at a broader picture.. there are people who remake the movie as a whole... which can't even appeal / make the audience sit back & watch for half an hour. when we compare to the volume of movies coming out each & every year... i guess Mani has carved his own mark. my idea is its better to make one good movie rather than making 100 movies which aren't worth watching.

PS: again we can't define a 'good movie'... as every director starts with a notion that he's the very best... there's no scale for talent though !


Krishh ,
You're doing a great job... i watch 4-10 movies straight up over a weekend.. and think of writing my thoughts about the movies i liked watching... the best i could do was list out some of my favorites ( http://japes.wordpress.com/movie_list )... i guess i gotta start writing too , from the inspiration i drew from you.

looking forward for more recommendations (on movies) from you.

Anonymous said...

hello friends, iam extremely sorry for troubling you.as it was mentioned by many visitors that Maniratnam is a great,commerical director.ofcourse yes agreed.but atthe same time i beg to differ with you.has any one ever tried the invisible relation between Mounaragam and Mounageetham?between PATTAKATTI bHAIRAVAN(Katakatala Rudrayya )and DALAPATHI?IT NEEDLES TO mention the inseparable resmblance between Nayakan and Godfather particularly the Robert de nero episodes.here i would like to remind one interesting anecdote.Most us knew and watched Ompuri's Arthsatya.it was rumored the main badman Sadasiv Amrapukar' role was moulded on Varadarajnaiker a tamilian gangster.to compensate that our maniratnam paid tributes to Varadarajanaiker through Godfather with Nayakan.he declared that he is an staunch atheist but i doubt it too.and muy main contention is Geetanjali which acquired an semiclassic,cult movie status is an out and out remade film.when i was in my PG final year iwatched that movie 5times.but one day our favourite DD channel enlightened me by telecasting another real classic.i wondered wow.OMG what a straight lift.friends try to guess that classic name.there were striking remseblances right from the title,heroine's nameheroine fathers name really it is mind boggling.

rajendra

devarapalli.rajendrakumar@gmail.com