Monday, June 25, 2007

Nikolai Gogol


Letter to Gogol

కాఫ్కా(Franz Kafka) రాసిన The Castle లాగే గొగోల్ రాసిన Dead Souls ని కూడా ఒక unfinished masterpiece అంటారు , అది ఎందుకు unfinished గా మిగిలిపోయింది అన్నదానికి బోలెడు కధనాలు కూడా వినిపిస్తాయి , ఆయన దీని సీక్వెల్ రాసేపాటికి అయనలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువయ్యి తన రచన పై ఒక రకమైన dejection తో దాన్ని అలాగే పూర్తి చేయకుండా వదిలేసారు .పైగా రష్యా లో ఉన్న అప్పటి పరిస్థితులు ఆయన పై మరింత ప్రభావం చూపించి ఉండొచ్చు .

ఈ క్రమం లో నే ఆయన రష్యన్ రైతులను తిడుతూ Czar ని దేవుడి దూతగా గా కీర్తిస్తూ ఫేమస్ మరియూ కొంత నోటోరియస్ అయిన "Selected Excerpts from Correspondence with Friends" రాసారు. ఈ క్రమం లో Vissarion Belinsky అనే లిటరరీ క్రిటిక్ Gogol తను ఒక రచయిత అని మరిచిపోయి ఎలా ప్రవర్తిస్తున్నాడో చెబుతూ అతని రచనని తూర్పారబడుతూ ఒక పబ్లిక్ లెటర్ రాసారు. ఈ లెటర్ కి చాలా ఫేమస్ అయ్యింది , దీంతో గోగోల్ పై విమర్షల జడివాన మరింత పెరిగి ... ఆయన ఒక రకమైన black melancholy వెళ్ళిపోయాడు .... కానీ ఆయన రాసిన "The Cloak /The Overcoat " లాంటి నవలలు మాత్రం చాలా ఫేమస్ అయ్యాయి .... జుంఫా లాహిరి రాసిన "Namesake" లో The Cloak బుక్కే కధకి ఆధారం ...... Namesake ని అదే పేరు తో మీరా నాయర్ సినిమా గా కూడా తీసారు.
అందులో ప్రోటాగానిస్ట్ పేరు గోగోలే (Gogol).

"పొద్దు ” లో నికొలాయ్ గొగోల్ dead Souls ని తెలుగు లోకి అనువదిస్తున్నారని చూసా .... చాలా మంచి ప్రయత్నం ఆల్ ద వెరీ బెస్ట్ పొద్దు టీం !!

కొన్ని లింకులు :

Letter To Gogol full text ---- Letter To Gogol

Project Gutenberg లో Dead Souls ---- Dead Souls

The Cloak / The Overcoat ------ The Overcoat , full text

1 కూతలు:

Nagaraja said...

చక్కటి టపా. గొగోల్‌ను పరిచయం చేసినందుకు థాంక్స్.