Monday, July 02, 2007

గ్రహాంతర వాసులు

మొన్న మా ఫ్రెండ్ తో ఓ చిన్న డిబేట్ మొదలయ్యింది , గ్రహాంతర వాసుల ఉనికి తెలుసుకోవడానికి ఉన్న అడ్డంకుల గురించి ... కూసింత డిస్కషన్ ... కొసింత డిబేట్ ... ఆఖరుకు కొన్ని కంక్ల్యూసన్స్ ... మాకు తోచిన కొన్ని థాట్స్ ...

జీవం విశ్వం అంతా నిండి ఉంది . ఇన్ని కోటానుకోట్ల నక్షత్రాల లో ఒక్క దాంట్లో కూడా జీవం ఆవిర్భవించి బతికి బట్టకట్టలేదంటే సైన్సే ఒప్పుకోదు , అది కేవలం భూమి కే పరిమితం అయితే మాత్రం అదో పెద్ద మిరాకిలే ... కాబట్టి భూమి మీద కాకుండా మరి కొన్ని చోట్ల కూడా జీవం ఉండే అవకాశం లేక పోలేదు . కానీ దాని ఉనికి మనకు చేరడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ...

1) మన పాల పుంత లో నే జీవం ఉందనుకున్నా ... అది వేరే కాలానికి చెంది ఉండవచ్చు ... eg- Aliens ఒక 4 బిలియన్ సంవత్సారాల కింద ఉండి , ఇతర గ్రాహాంతర వాసుల కోసం అంటే మన కోసం వెతికితే మైక్రోస్కోపిక్ లెవల్లో కూడా మన జాడ వారికి తెలిసే అవకాశం లేదు ... కారణం భూమి మీద జీవం పుట్టి కేవలం 3.5 బిలియన్ సంవత్సారాలే అయ్యింది.

2) మన దురద్రుష్టం కొద్దీ మనకు Interstellar space లో చిన్న పాటి దూరాలు ప్రాయాణం చేయడానికి ఉన్న అవకాశాలు కూడా చాలా తక్కువ. ఒక Alien కమ్యూనిటీ మనమున్న టై ఫ్రేం లోనే ఉందనుకున్నా అది కాస్తా 30 వేల కాంతి సం. రాల(light years) దూరం లో ఉంటే మన చేసేది ఏవీ లేదు. అంత దూరం astronomical గా చూస్తే చాలా తక్కువ కానీ మనం చేరడానికి మాత్రం ఆస్కారం లేదు.

3) సరే ... ఆ Aliens కాస్తా మన టైం ఫ్రేం లోనే ఉండి , మనం చేరగలిగే దూరం లో ఉన్నా వారిని చేరుకోక పోవడానికి ఇంకో కారణం ఉంది. ఆ Alien కమ్యూనిటీ జీవం మనకు సంబధం లేని మరో form లో ఉండొచ్చు. అంటే వారి జీవం మనలా carbon బేస్డ్ గా కాకుండా silicon ద్వారా నిర్మితమై ఉంటే ఇప్పుడు మనచేసే బయలాజికల్ టెస్ట్స్ ద్వారా వారి ఉనికిని తెలుసుకోలేం ... మనం పంపించిన రోవర్స్ వల్ల కానీ మ్రే ఇతల sattileite vehicles ద్వారా కానీ ఇతర గ్రాహాల పై మైక్రోస్కోపిక్ లెవల్లో పరి్శొధనలు చేయడం కూసింత కష్టం.

కాబట్టి ఈ కష్టాలన్నీ గట్టెక్కి ఆ Aliens ని కనుక్కునే సరికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో ...


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పైన చెప్పిందంతా ట్రాష్ ... ఇప్పుడు అసలు నిజం చెబుతాను ....

అసలు నే ఈ గ్రాహానికే చెందినవాడిని కాదు ... MARS నుంచి వచ్చా .... yeah ... i'm a martian.

మా గ్రహం పై జనాభా ఎక్కువై పోవడం తో ఉండడానికి ఇతర గ్రాహాలేవైనా ఉన్నాయో చూడ మని మా మార్స్ ప్రభుత్వం కొంత మంది సైనికుల్ని పంపింది ... దాంతో వెత్తుకుంటూ నేను భూమిదకొచ్చి పడ్డా ... హ హా .... తొందరలో మా సైన్యం వచ్చేస్తుంది .... భూమి పై గెలిచి , ఆక్రమించేస్తాం ...... హి హ హ ......

(Marvin the Martian )

6 కూతలు:

radhika said...

అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా సినిమా స్టోరీనా?వ్యాసం మొదట చూడగానే చీకట్లో సూర్యుడు నవలలోని విషయాల్లా అనిపించాయి.

oremuna said...

welcome to paaTibaMDa

http://groups.google.com/group/paaTibaMDa

Krishh Raem said...

@ radhika gaaru :

సినిమా స్టోరీ కాదు ... :) , పై పార్ట్ నిజంగా నిజం ... ఆ నవల గురించి తెలియదు , బై ద వే ఏ సైన్స్ స్టూడెంట్ అలోచించినా ఈ టాపిక్ గురించి చేసే మొదటి conclusions ఇవే .... ఇక కింది పార్ట్ ... సొల్లు అన్నమాట ...;)

@ oremuna : ఓ ... అల్రెడీ సొల్లు కబుర్ల కోసం ఒక గ్రూప్ ఉందా గుడ్ గుడ్ ... వీలు చూసుకుని జాయిన్ అవుతా .... :)

ప్రవీణ్ గార్లపాటి said...

ఏంటో మీరు ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ చూస్తున్నారేమొ :)

Krishh Raém said...

@ ప్రవీణ్ గార్లపాటి :
lolz !! yeah kinda !! Philip K. Dick బుక్స్ చదువుతున్నా .... దంతో బుర్ర బ్లాక్ అయ్యింది కాస్త !! ;)

srinath said...

ఎం సర్ సంవస్చారం క్రితం చేసిన డిస్కషన్ ఇప్పటివరకు చెప్పలేదు...
అంట బాగా నే ఉండి కానీ నువ్వు నేను ఎవరం కూడా మార్స్ నుంచి కాదు కానీ ఇంకా వేరే ఏ అలిఎన్ ప్లానెట్ నుంచి ఐన ఊది పడ్డాం అనుకుంట..